`ప్రేమ మొదలైంది`.. అవార్డులు.. చిందులతో రచ్చ..
48 రోజు బిగ్‌బాస్ సీజన్ 4 సాదా సీదాగా సాగింది. సెంచురీ మ్యాట్రిసెస్ ప్రమోషన్‌లో భాగంగా ఇంటి సభ్యులతో బ్లాక్ బస్టర్ సినిమా `ప్రేమ మొదలైంది` చిత్రాన్ని రూపొందించాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్‌లో డైరెక్టర్‌గా అభిజిత్, కెమెరామెన్‌గా నోయెల్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా దివి, కొరియోగ్రాఫర్‌గా అమ్మ రాజశేఖర్.. ఆర్టిస్ట్‌లుగా అఖిల్, మోనాల్, అవినాష్, హరియానా కనిపించారు.
దీనికి సంబంధించిన ప్రీమియర్ షోని శనివారం ఎపిసోడ్‌లో చూపించారు. ఆ తరువాత అవార్డుల కార్యక్రమం జరిగింది. వివిద కేటరీల్లో ఇంటి సభ్యులు అభిజిత్, అఖిల్, మోనాల్, హరియానా, అవినాష్, మెహబూబ్, లాస్య, లమ్మరాజశేఖర్, సోహైల్, హారిక, దివి, నోయెల్ అవార్డులు అందుకున్నారు. ఆ తరువాత ఇంటి సభ్యులు నచ్చిన పాటలకు డ్యాన్సులతో రచ్చ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా రొటీన్‌గా పేలవంగా ఈ శనివారం ఎపిసోడ్ సాగింది.