స్వీట్ స‌ర్‌ప్రైజ్ : ప‌వ‌న్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్‌!

-

రెండేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వుంటూ వచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస‌గా స‌ర్‌ప్రైజ్‌లిస్తున్నారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్న ప‌వ‌ర్‌స్టార్ తాజాగా మ‌రో షాకింగ్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, బీజు బీన‌న్ క‌లిసి న‌టించిన చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డ‌మే కాకుండా ఇత‌ర భాష‌ల మేక‌ర్స్‌ని ఎట్రాక్ట్ చేసింది.

దీంతో ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల‌కు ఇత‌ర బాష‌ల్లో భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఈ మూవీ రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. సితార‌తో క‌లిసి ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాయి. ఇందులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్‌కు `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌.

దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్ రేపు ఉద‌యం 10:35 నిమిషాల‌కు రానుంద‌ని తెలుస్తోంది. తాజాగా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో `విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అంద‌రికి స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాం. రేపు ఉద‌యం 10:35 నిమిషాల‌కు క‌లుద్దాం` అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప‌వ‌న్ తో చేయ‌బోతున్న `అయ్య‌ప్పనుమ్ కోషియుమ్‌` రీమేక్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ ఇవ్వ‌బోతున్నార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. లెట్స్ వేయిట్ అండ్ సీ ఏ న్యూస్‌ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ రివీల్ చేయ‌బోతున్నారో..

Read more RELATED
Recommended to you

Exit mobile version