Samantha: యశోద సినిమా అంతటి బడ్జెట్ వర్కౌట్ అయ్యేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. గడచిన కొద్ది రోజుల క్రితం సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తానే స్వయంగా తెలియజేయడం జరిగింది. సమంత నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా సమంత ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రాన్ని హరి,హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమంత కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతోందని చెప్పవచ్చు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో భారీ ఎత్తున థియేటర్లో విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇప్పటికే యశోద సినిమా ట్రైలర్,పోస్టర్స్ విడుదల అవ్వగా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కోసం సమంత ఒక ఇంటర్వ్యూ రికార్డు చేసి విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట యశోద చిత్రాన్ని కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారట చిత్ర బృందం. కానీ ఈ సినిమా ఇప్పుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ సినిమా అన్ని కలుపుకొని రూ.40 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిర్మాత శివలెంకే ఈ చిత్ర కథ మీద నమ్మే మరొక నిర్మాత చింతగోపాల్ రెడ్డి సహకారంతో ఈ సినిమాను చేసినట్లుగా తెలియజేశారు. అయితే సమంత మీద కేవలం ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టడంపై ఒక వర్గం అభిమానులు కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి సమంత సినిమాకు రూ 30 కోట్లకు బడ్జెట్ అవుతుంటే.. పబ్లిసిటీ కోసమే ఈ సినిమా రూ.40 కోట్లు ఖర్చు అయిందని ప్రచారం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సమంత నటించిన ఓ బేబీ వంటి చిత్రం రూ.16-20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టగా కలెక్షన్ పరంగా రూ.30-40 కోట్ల వరకు కలెక్షన్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రేంజ్ ఉన్న సమంత నటించిన చిత్రాలు రూ. 50 కోట్లు మార్కు దాటాలంటే అందులో సమంత పాత్ర చాలా ఉందని చెప్పాలి. యశోద సినిమాతో సమంత ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version