తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన చూపించిన నటన పట్ల గర్వపడుతున్నాను అంటూ తెలిపారు.చిరంజీవి అంతే కాదు ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ వరకు వెళ్లడం పట్ల చాలా ఆనందంగా ఉందని.. అందులో చరణ్ నటించడం ఇంకా గర్వంగా ఉందని.. చరణ్ స్థానంలో నేనే ఉన్నట్టుగా భావిస్తున్నాను అంటూ తెలిపారు మెగాస్టార్.
రంగస్థలం సినిమాలో చరణ్ నటన గురించి చెబుతూ అందులో చెవిటి వాడిలా చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయాడని అద్భుతమైన నటన కనబరిచాడు అని తెలిపారు. జాతీయ అవార్డు రాకపోయినప్పటికీ ఆడియన్స్ గుండెల్లో ఉన్నాడు అని తెలిపారు. ఇప్పటికీ రాంచరణ్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది పలు జాతీయ అవార్డ్ లతో సమానమని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా ఆ సినిమాలో చరణ్ నటన చూసి గర్వపడుతున్నాను అంటూ తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా విశ్వరూపం చూపించారని .. ఎన్నో షేడ్స్ కనబరుచారు అని.. రాజమౌళి దర్శకత్వంలో.. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని ఇప్పుడు ఆస్కార్ పోటీలో కూడా నిలిచింది అని ఆయన ప్రస్తావించారు.
ఇంతకంటే తెలుగు వాడికి ఇంకేం కావాలని చిరంజీవి తెలపడం గమనార్హం. అయితే ఇందులో రామ్ చరణ్ నటించడం ఒక తండ్రిగా తాను చాలా గర్వపడుతున్నాను అని ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలన్నీ కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చిరంజీవి చెబుతూ తన కొడుకు పై ప్రేమను ఒలకబోసారు.