అమ్మాయిల కోసం… సామ్‌సంగ్‌ ‘గెలాక్సీ బ్లూమ్‌’

-

రంగురంగుల కవర్లతో చూడగానే కట్టిపడేసేటట్టు ఉండనున్నది ఈ బ్లూమ్‌. అమ్మాయిల కంటపడితే కొనకుండా ఉండలేరు.

సాధారణంగా మొబైల్‌ ఫోన్లు అమ్మాయిలకు ప్రత్యేకమని ఎవరూ తయారుచేయరు. ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత సామ్‌సంగ్‌.

Samsung Galaxy Bloom Foldable Smartphone to Launch Next Month

సామ్‌సంగ్‌ ఫిబ్రవరి11న నిర్వహించబోయే ఈవెంట్‌లో ఎస్‌ 20 లతో పాటు, ‘గెలాక్సీ బ్లూమ్‌’ అనే సరికొత్త మొబైల్‌ను కూడా పరిచయం చేయనుంది. అన్నట్లు  ఈ మోడల్‌లో అమ్మాయిలకోసం కూడా కొన్ని డిజైన్లు ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఉండే వర్ణాలతో పాటు ఆమ్మాయిలకు ఆహ్లాదంగా ఉండే, వారు మెచ్చే రంగుల్లో  కూడా ఈ ఫోన్‌ విడుదల కానుంది.

కలర్‌ తెరలు వచ్చిన కొత్తల్లో, కొన్ని ఫోన్లు ఇలాగే అమ్మాయిలకోసం కూడా తయారుచేసారు. చాలా ఏళ్ల తరువాత సామ్‌సంగ్‌ ఈ కొత్త ఫోన్‌ను వారికి అంకితం చేయనుంది. ప్రత్యేకతలు మాత్రం పెద్ద స్థాయిలోనే ఉంటాయి. ఎస్‌ 20 సిరీస్‌ ఫోన్లలో ఏవైతే ప్రత్యేకతలుంటాయో, దాదాపు అవే ఈ బ్లూమ్‌లో కూడా ఉండే అవకాశముంది. ఈ లెక్కన ధర కూడా ఎక్కువగా ఉండబోతోంది.

లీకైన ప్రచారచిత్రాలను బట్టి చూస్తే, కచ్చితంగా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు వాడే కాస్మొటిక్స్‌ సాధనాలతో పోలుస్తూ ఈ ప్రచార చిత్రాలు తయారయినట్టున్నాయి. ఫోన్ల రంగులు కూడా ఆడవాళ్లకు నచ్చేట్టుగా కూల్‌ కలర్స్‌ వాడారు. ఈ రకమైన నిలువు ఫ్లిప్‌ ఫోన్లు అప్పట్లో ఎక్కువగా అమ్మాయిలే వాడారన్న సత్యాన్ని గుర్తుకు తెచ్చుకున్న సామ్‌సంగ్‌ ఈ బ్లూమ్‌ మీద తన దృష్టిని ఆ రకంగానే కేంద్రీకరిచింది.

చూద్దాం… ఈ ఫోన్‌ ఏ మేరకు అమ్మాయిలను ఆకట్టుకుంటుందో… ఫిబ్రవరి తర్వాత తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version