29న తలపెట్టిన ట్యాక్టర్ ర్యాలీ వాయిదా: సంయుక్త కిసాన్ మోర్చా

-

ఈ నెల 29న పార్లమెంట్‌కు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు శనివారం సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు దర్శన్ పాల్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని సింఘు సరిహద్దులో సమావేశమైన తర్వాత ట్రాక్టర్ ర్యాలీ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత కూడా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం సబబు కాదని అత్యధిక మంది రైతు సంఘాల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే నెల 4న సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు 500 ట్రాక్టర్లతో శాంతియుతమైన ర్యాలీ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ప్రకటించారు. అదేరోజు మూడు సాగు చట్టాలను తీసుకువచ్చి ఏడాది పూర్తి కానున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు దన్నుగా నిలుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో ఒత్తిడి పెంచడం కోసం ట్యాక్టర్ ర్యాలీ సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version