మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సంయుక్తమేనన్..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కథ పూర్తయినప్పటికీ హీరోయిన్ ల, నటీనటుల ఎంపిక విషయంలో కాస్త ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన అందాల భామ సంయుక్త మేనన్ ఈ సినిమాలో నటిస్తోంది అన్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం .ఇక అసలు విషయం ఏమిటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కలసి తెరకెక్కించిన మల్టీ స్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించగా.. రానా సరసన అందాల భామ సంయుక్తమేనన్ నటించింది. ఇక ఈ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈమె వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇకపోతే ఈమె తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న బింబిసార సినిమాలో కూడా నటిస్తోంది.ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోని మీడియాతో ముచ్చటించిన ఈమె కొన్ని విషయాలను కూడా వెల్లడించింది.

సంయుక్త మేనన్ మాట్లాడుతూ నటి అవుతానని అనుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి అవకాశం రావడంతో అలా వచ్చి ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతున్నాను. ఇక ఈ విషయాన్ని నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను. మలయాళం లో నేను నటించిన సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక దీంతో తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి . భాష తెలియకుండా నటిస్తే క్యారెక్టర్ తో కనెక్షన్ మిస్ అవుతుందని నా పాత్రకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అంటూ ఆమె తెలిపింది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ప్రత్యేకంగా ట్యూటర్ ను పెట్టుకొని మరి తెలుగు నేర్చుకున్నాను అని తెలిపింది. ఇకపోతే త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాకి కూడా ఆఫర్ వచ్చింది అని కానీ ఈ సినిమాలో తాను నటించడం లేదు అని ఆమె చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version