పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్..‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్..!

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు పాలిటిక్స్ లోనూ బిజీగా ఉన్నారు. ఒకే సమయంలో రెండు రంగాలు సినిమా, రాజకీయం అనగా జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే ఇటీవల రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ ఏంటనే చర్చ సోషల్ మీడియాలో జరిగింది.

ఈ క్రమంలోనే క్రిష్-పవన్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పిక్చర్ ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నారు.

రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ నటిస్తున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఈ ఫిల్మ్ ను ఏ.ఎం.రత్నం, దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version