పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ రిప్లై..!

-

చిక్కడపల్లి పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ రిప్లై ఇచ్చింది. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాట.. ఓ మహిళా ప్రాణాలు కోల్పోవడం.. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతుండటంతో.. సంధ్య థియేటర్ కు పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దానికి సమాధానంగా.. 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపారు సంధ్య థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయి.

గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నాం.. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది స్టాప్ విధుల్లో ఉన్నారు. 4, 5 తేదీల్లో థియేటర్ ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుంది. గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్ లో సినిమా లకు వచ్చారు. సంధ్య థియేటర్లో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ కి ప్రత్యేక పార్కింగ్ ఉంది అని పేర్కున్నారు యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Latest news