మహిళ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసు దొంగిలించిన సర్పంచ్‌

-

 

తమిళనాడులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసు దొంగిలించాడు పంచాయతీ సర్పంచ్‌. తన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించడం లేదని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది నేర్కుండ్రం నివాసి వరలక్ష్మి(50). కాంచీపురంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా బస్సులో బంగారు గొలుసు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళ.

Sarpanch steals 5 tola gold chain from woman's neck
Sarpanch steals 5 tola gold chain from woman’s neck

ఆ దొంగతనం చేసింది మరెవరో కాదని.. బస్సులో వరలక్ష్మి పక్కన కూర్చున్న మహిళే అని గుర్తించారు పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె తిరుపత్తూరు జిల్లా నార్యంపట్టు పంచాయతీ సర్పంచ్‌ భారతి(56)గా గుర్తించారు.
ప్రజాసేవలో ఉన్న ఓ మహిళ ఇలా ప్రవర్తించడంతో అవాక్కయ్యారు పోలీసులు. నిందితురాలు భారతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసారు. గతంలో సైతం తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరు ప్రాంతాల్లో భారతిపై దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news