అల్లు అరవింద్‌కు ఊ హించని షాక్ తగిలింది. మీ పెంట్ హౌజ్ కూలుస్తాం అంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారట జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేశారు అల్లు అరవింద్.

ఇక ఇటీవల అనుమతులు లేకుం డా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు . ఈ మేరకు మీ పెంట్ హౌజ్ కూలుస్తాం అంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారట జీహెచ్ఎంసీ అధికారులు. మరి దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.