కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని విధంగా ఫలితాలు రావడంతో తేరుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ముఖ్యంగా ఈ ఫలితాలు దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలపై పడనుందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ప్రజలు ఇదే విధంగా గద్దె దించుతారని బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. ఈయన మాట్లాడుతూ తెలంగాణాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ మరియు బీజేపీలు గెలిచే అవకాశం లేదని కొట్టిపారేశారు.
శాసనమండలి చైర్మన్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం…
-