పారాహుషార్..! ఎస్బీఐ ఖాతా దారులకు ఓ ఘమనిక. మీకు ఎస్బీఐ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉందా..? ఉన్నట్టయితే ఈ వార్త మీకోసమే. సాధారణంగా ఏటీఎం కార్డులకు కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని అతిక్రమిస్తే ఛార్జీలు తప్పవు. ప్రతీ నెల కార్డు హోల్డర్ లకు బ్యాంకులు కొన్ని ఉచిత ట్రాన్సాక్షన్లు ఇస్తాయి. వాటిని పూర్తిగా ఉపయోగిస్తే ఆపై జరిపే ట్రాన్సాక్షన్లకు బ్యాంక్ ఛార్జీలు విధిస్తుంది. అయితే గతంలో బ్యాంకులు ఏటీఎం కార్డు దారులకు మెట్రో నగరాల్లో అయితే 6 ఉచిత ట్రాన్సాక్షన్లకు ఇతర బ్యాంకుల్లో 4 సార్లు ట్రాన్సాక్షన్లకు అనుమతులు ఇచ్చేవి. అంటే 6 సార్లు మన డబ్బు మన బ్యాంక్ ఏటీఎం లో విత్ డ్రా చేసుకోవచ్చు అంతకు మించి చేస్తే విత్ డ్రా చేసిన ప్రతీ సారి ఆధానంగా 10 రూపాయలను బ్యాంక్ వసూలు చేసేది అన్నీ బ్యాంకుల్లోనూ అంతే. ఇక ఇదే నేపద్యంలో తాజాగా ఎస్బీఐ బ్యాంక్ ఓ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఏటీఎం సేవలు ఉపయోగించే ఖాతాదారులు మెట్రో నగరాల్లో అయితే 5 సార్లు ఎస్బీఐ ఏటీఎంలో, 3 సార్లు వేరే బ్యాంక్ ఏటీఎం లలో అంటే 8 సార్లు ఉచితంగా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అదే నాన్ మెట్రో నగరాల్లో అయితే 5 సార్లు ఎస్బీఐ ఏటీఎం లో, 5 సార్లు ఇతర బ్యాంక్ ఏటీఎం లలో అంటే మొత్తం 10 ఉచిత విత్ డ్రా లు చేసుకోవచ్చు అంతకు మించి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేస్తే విత్ డ్రా చేసిన ప్రతీ సారి 20 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీలు విధిస్తుంది. గతంలో ఉండే 10 ని ఇప్పుడు రెట్టింపు చేస్తూ 20 రూపాయలుగా మార్చింది.
పారాహుషార్..! SBI ఖాతాదారులకు ఓ ముఖ్య గమనిక….!
-