అవతలి వారికి గూగుల్‌పే లేకున్నా నగదు ఇలా ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు..!

-

దేశంలో గూగుల్‌ పే ప్రస్తుతం ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. చాలా మంది ఈ యాప్‌ను నగదు చెల్లింపుల కోసం వాడుతున్నారు. మొదట్లో దీంట్లో కేవలం నగదు ట్రాన్స్‌ఫర్‌కు మాత్రమే అనువుగా ఉండేది. కానీ తరువాత బిల్లు చెల్లింపులకు కూడా అనుమతిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కొన్ని కోట్ల మంది గూగుల్‌ పేను వాడుతున్నారు. అయితే సాధారణంగా అవతలి వారికి గూగుల్‌ పే ఉంటేనే నగదు పంపించడం సాధ్యమవుతుందని, లేకపోతే డబ్బులు పంపలేమని కొందరు భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. అవతలి వారికి గూగుల్‌ పే లేకపోయినా సరే.. వారికి మన గూగుల్‌ పే నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అది కూడా చాలా సులభంగా నగదు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. మరి అదెలాగో ఇప్పుడు స్టెప్‌ బై స్టెప్‌లో తెలుసుకుందామా..!

అవతలి వారికి గూగుల్‌ పే లేకున్నా కింది స్టెప్‌లలో వారికి ఆన్‌లైన్‌లో నగదు ఇలా సులభంగా పంపవచ్చు.

స్టెప్‌ 1 – గూగుల్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేసి అందులో హోం స్క్రీన్‌పై ఉండే న్యూ పేమెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

స్టెప్‌ 2 – తరువాతి విండోలో కనిపించే బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌ అనే ఆప్షన్‌పై ప్రెస్‌ చేయాలి.

స్టెప్‌ 3 – నగదు పంపాలనుకున్న అవతలి వ్యక్తికి చెందిన బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, బ్యాంక్‌ బ్రాంచ్‌ కోడ్‌లను ఎంటర్‌ చేయాలి. ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌ను అక్కడ యాప్‌ ఆటోమేటిగ్గా సెర్చ్‌ చేసుకుంటుంది. దీంతో ఆ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సిన పనిలేదు.

స్టెప్‌ 4 – తరువాత స్క్రీన్‌పై కనిపించే స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి. దీంతో నగదు ట్రాన్స్‌ఫర్‌ పూర్తవుతుంది. డబ్బులు అవతలి వ్యక్తికి చేరగానే మనకు ఆ నోటిఫికేషన్‌ వస్తుంది.

ఈ విధంగా అవతలి వారికి గూగుల్‌ పే లేకపోయినా సరే.. వారి బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, బ్యాంక్‌ బ్రాంచ్‌ కోడ్‌లను ఎంటర్‌ చేసి ఆన్‌లైన్‌లో సులభంగా, వేగంగా నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version