ఈ రెండ్రోజులు ఎస్‌బీఐ యోనో సర్వీసులు బంద్..!

-

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ వినియోగదారులకు పలు సూచనలు తెలిపింది. ఎస్‌బీఐ బ్యాంక్ యాప్ యోనో సేవలు మరో రెండ్రోజుల పాటు నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ కస్టమర్లకు తెలియపర్చింది. అండర్ మెయింటెనెన్స్ లో భాగంగా ఈ నెల 11, 13వ తేదీల్లో యోనో యాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కస్టమర్లు తమ సర్వీసుల నిలిపివేతతో ఎలాంటి ఇబ్బందులు గురికావొద్దని, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది.

sbi

అయితే యోనో యాప్ లో ఇటీవల ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీ-లాగిన్ లక్షణాలతో ఎస్‌బీఐ కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందులో బ్యాంకు పాస్ బుక్ ను చూసుకోవచ్చు. లాగిన్ అనే ఆఫ్షన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. అయితే అండర్ మెయింటెనెన్స్ ఉన్న కారణంగా కస్టమర్లు ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించవద్దని ఎస్‌బీఐ కోరింది.

అయితే మొదట్లో ఎస్‌బీఐ లాగిన్ సదుపాయాన్ని కల్పించింది. కానీ లాగిన్ అవసరం లేకుండానే పై సేవలు పొందేందుకు కస్టమర్లు తమ యోనో యాప్ లో సెట్టింగ్ లు మార్చుకోవాలని బ్యాంక్ స్పష్టం చేసింది. కస్టమర్లు యోనో యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత వ్యూ బ్యాలెన్స్ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. ఎంపిన్, బయోమెట్రిక్ వంటి సేవల ద్వారా ఈ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. యోనో యాప్ ద్వారా సులభంగా డబ్బులు పంపించవచ్చు. ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా రూ.2000 వరకు డబ్బులు పంపిచుకోవచ్చు. అయితే దీని కోసం యోనో క్విక్ అనే ఆఫ్షన్ ను క్లిక్ చేయాలి. ఎస్‌బీఐ యోనో యాప్ ని బ్యాంకింగ్, షాపింగ్ అవసరాలను తీర్చేందుకు, ఈజీ పేమెంట్ విధానాన్ని అమలుపర్చేందుకు 2017లోఈ యాప్ ను తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version