బట్టల షాపులో కి‘లేడీ’ల చేతివాటం..కాళ్లమధ్యలో పెట్టి రూ.10వేల చీరలు చోరీ!

-

ఎక్కడ చూసినా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. పబ్లిక్,ప్రైవేట్ ప్రాంతాలు అని వారికి సంబంధం లేదు. అదును దొరికితే చాలు సైలెంట్‌గా తమ పనిని వారు చేసుకుని వెళ్తున్నారు.అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో కి‘లేడీ’లు చేతివాటం ప్రదర్శించారు. బట్టలు కొనేందుకు వచ్చి కొన్నట్టే యాక్టింగ్ చేశారు.షాపులోని వర్కర్లను కాస్త పనిలో నిమగ్నం అయ్యేలా చేసి గుట్టుగా తన పని చేసుకుని వెళ్లారు.

ఏకంగా కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10వేల విలువైన చీరలను దొంగతనం చేశారు.ఈ ద‌ృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సిక సారీ సెంటర్లో జరిగింది. ఐదుగురు మహిళలు బట్టలు కొనేందుకు వచ్చి రూ.10 వేల విలువైన చీరలు దొంగతనం చేశారు. చివరలో బేరం చేసి కాలిగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన యజమాని సీసీటీవీ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓనర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version