Nani : ‘సరిపోదా శనివారం’ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

టాలీవుడ్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో రాణిస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని ఇటీవలే వివేక్ ఆత్రేయ దర్శక్తవంలో సరిపోదా శనివారం అనే సినిమా చేశారు. వీరిద్దరి కాంబోలో అంటే సుందరానికి మూవీ నిరాశ పరిచింది. దీంతో ఈ సినిమాని చాలా ప్రెస్టేజీగా తీసుకొని తెరకెక్కించారు వివేక్ ఆత్రేయ. 

దీంతో సరిపోదా శనివారం మూవీ పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా నాని హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం డిమాండ్ ఏర్పడింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. సెప్టెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఎస్.జే. సూర్య విలన్ గా ఆకట్టుకున్నారు. నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్, అతిథి బాలన్, అభిరామి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version