తెలంగాణ పంచాయతీల ఎన్నికలకు కౌంట్ డౌన్ షూరూ అయింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలోనే తెలంగాణ పంచాయతీలలో ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ జాబితా విడుదల కానుంది.

ఈ నెల 29, జిల్లా స్థాయి.. 30న మండల స్థాయి రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ సమావేశం కానుంది. సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. కాగా, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ తేదీ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5,817 నుంచి 5,773కి తగ్గింది. 71 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనం కావడమే దీనికి గల ప్రధాన కారణం. తాజాగా ఇంద్రేశం, జిన్నారం, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య మరింతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రామపంచాయతీలు 12,760 కానుండగా వార్డుల సంఖ్య 1,12,500కు చేరింది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల సంఖ్య 56గా ఉండగా… జిల్లా పరిషత్ ల సంఖ్య 31గా ఉన్నాయి.