రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్

-

ఢిల్లీలో రేపటి నుంచి పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలని కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గాలి కాలుష్యం సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. గాలి కాలుష్యం పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

గాలి కాలుష్యం నేపథ్యంలో.. పిల్లల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన అంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం పై మండిపడింది సుప్రీంకోర్టు. 3-4 సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళుతూ ఉంటే… పెద్దలు మాత్రం వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. పెద్ద వాళ్లకు న్యాయం… చిన్నపిల్లలకు ఒక న్యాయమా ? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వెంటనే స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో దిగివచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు పాఠశాలలను తిరిగి … ప్రారంభించాలని చెప్పేంతవరకు… తాము విద్యాసంస్థలను పునః ప్రారంభించ బోమని స్పష్టం చేసింది కేజ్రీవాల్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version