వసంత రుతువులో అందమైన చర్మం మీ సొంతం కావడానికి మీరు తీసుకోవాల్సిన పదార్థాలు..

-

వసంత రుతువు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో వేసవి రెడీగా ఉంటుంది. ఈ రుతువు మారే ప్రక్రియలో చర్మంపై సహజంగా అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. సాధారణంగా ఈ టైమ్ లో తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచి, మీ జీవక్రియను మెరుగుపరిచే ఆహారాలని భాగం చేసుకుంటే చర్మ సౌందర్యంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీర పీహెచ్ విలువని సరిగ్గా ఉంచుకుంటే బాగుంటుంది.

ఇంకా, చర్మం తేమగా ఉండేలా చూసుకోవాలి. దానికోసం మనమేం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

టమాట

టమాటలో ఉండే లైకోపీన్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలని పోగొట్టడంలో ఇవి సాయపడతాయి. టమాటలని ముక్కలుగా కోసి పేస్ట్ లాగా చేసి ముఖంపై పెట్టుకుని కొద్ది సేపయ్యాక చల్లని నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

జోజోబా నూనె

చర్మాన్ని తేమగా ఉంచడంలో కీలకం. ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలని మూసుకు పోకుండా ఉంచి నల్లమచ్చలు, మొటిమలు ఏర్పడకుండా సాయం చేస్తుంది.

చక్కెర స్క్రబ్

చర్మంపై ఉన్న మురికిని పోగొట్టేందుకు చక్కెర స్క్రబ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో ఉండే గ్లైకోలిక్ ఆమ్లం చర్మంలోకి చొచ్చుకుపోయి మలినాలని బయటకి పంపించి వేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల చక్కెర తగిన పాళ్ళలో నీరుకలుపుకుని స్క్రబ్ లాగా చేసుకుంటే సరిపోతుంది.

పెరుగు

పెరుగుతో ముఖానికి మసాన్ చేసుకుంటే చాలు చర్మం సురక్షితంగా ఉండి బయట వాతావరణానికి చెక్కు చెదరకుండా ఉంటుంది.

రుతువు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version