ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మల్కాజ్ గిరి ఏసీపీ నర్సింహారెడ్డి రెండోరోజు ఏసీబీ సోదాలు కొన సాగుతున్నాయి. నిన్న 25 చోట్ల ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో 70కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇవాళ కూడా నర్సింహారెడ్డి, ఆయన బినామీల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. నర్సింహారెడ్డి బినామీగా భావిస్తోన్న ఒక ఏఎస్ఐ ఇంట్లో అధికారులు కీలక సోదాలు జరుపుతున్నారు. అక్కడి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.
ఈ మధ్యాహ్నం వరకు సోదాలు కొనసాగవచ్చని అంచనా. ఇప్పటికే గుర్తించిన నర్సింహారెడ్డికి చెందిన రెండు బ్యాంక్ లాకర్లను కూడా ఈరోజు ఆయనను తీసుకు వెళ్లి ఇవాళ తెరవనున్నారు. సోదాలు ముగిసే సమయానికి ఏసీపీ ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మాదాపూర్ కు చెందిన ఒక మహిళ పేరు మీద నరసింహారెడ్డి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. గతంలో లో ఒక ఎస్సైని పట్టుకొని అతని చేత భూ అక్రమాలు చేయించినట్టు కూడా గుర్తించారు. ఇక నేడు నరసింహారెడ్డిని ఏసీబీ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నది.