ఏపీలో రెండో విడత పోలింగ్.. బ్యాలెట్ పత్రాల అపహరణ

-

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే రెండో విడత ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ పత్రాలను అపహరించినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

elections

గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు దొంగిలించబడ్డాయని అధికారులు పేర్కొంటున్నారు. గుర్తు తెలియని కొందరు దుండగులు రాత్రిపూట బ్యాలెట్ అపహరించి ఉంటారని, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఎన్నికల సిబ్బంది తెలిపారు. బ్యాలెట్ పత్రాలు దొంగిలించడంతో దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడించింది.

మొదటి విడతలో కూడా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు దొంగిలించ బడ్డాయి. ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బ్యాలెట్ పత్రాలకు భద్రత లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. మొదటి విడతలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో మంగళవారం రాత్రి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు అక్రమంగా చొరబడి చివరి రౌండ్ బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు. దీంతో నేడు కందరాడలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లడంతో తమకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభ్యర్థి పిల్ల సుశీల ఆందోళనకు దిగారు. ఎన్నికలు నిర్వహించకుండా తనను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో.. కౌంటింగ్ నిర్వహించకుండా సర్పంచ్‌ను ప్రకటించలేమని ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం 6గంటలకు రీకౌంటింగ్ నిర్వహించారు. ఇందులో పోలైన ఓట్లను పరిశీలించగా.. 43 బ్యాలెట్ పత్రాలు అపహరణకు గురైనట్లు ఎన్నికల సిబ్బంది వెల్లడించింది. టీడీపీ అభ్యర్థి పిల్ల సుశీల, మద్దతుదారులు ఆందోళన చేయడంతో శనివారం రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా, బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లడంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గెలుస్తామనే ధైర్యం లేకే ఈ పనికి పా

Read more RELATED
Recommended to you

Exit mobile version