ఏపీలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సాయంత్రం మూడున్నుర దాకా పోలింగ్ సాగనుండగా అనంతరం వోట్ల లెక్కింపు జరగనుంది. ఇక తొలి విడతలో మాదిరిగానే.. రెండో విడతలో కూడా భారీగానే ఏకగ్రీవాలు నమోదయ్యాయి. రెండో విడతలో మొత్తంగా 13 జిల్లాల పరిధిలో జరగనున్నాయి. 167 మండలాల్లో రెండో విడతలో 3328 గ్రామాల్లో ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తే.. వాటిల్లో 539 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి.
తొలి విడతలో విజయనగరం మినహా మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు జరిగితే.. రెండో విడతలో విజయనగరం జిల్లాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం 7510 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక వార్డుల విషయానికొస్తే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 20 వేల వార్డులకు పైగా ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం సుమారు 44, 879 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఇక ఈ వాచ్ యాప్ పై హైకోర్టులో స్టే ఉండడంతో ఎస్ఈసీ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 0866 2466877తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఫిర్యాదులు స్వీకరించనుంది ఎస్ఈసీ.