యూఎస్ లో కరోనా కల్లోలం..రెండు రోజుల్లో రెండు లక్షల కేసులు…!

-

అమెరికాలో కరోనా వైరస్‌ మహామ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపుతోంది. గత కొద్దిరోజుల నుంచి అగ్రరాజ్యంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయ్‌. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా లక్షా ఆరు వేల 414 కరోనా కేసులు నమోదయ్యాయ్‌. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరువైంది. ప్రస్తుతం 99 లక్షల 19 వేల 522 మంది బాధితులు ఉన్నారు. కరోనా వైరస్‌ బారినపడి గడిచిన 24 గంటల్లో దాదాపు 1000 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 40 వేల 953 మంది వైరస్‌కు బలయ్యారు. దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల పెరుగుదల శాతం 7.1గా ఉంది.

అమెరికాలో కోవిడ్-19 ప్రభావం ఇప్పడప్పుడే తగ్గేలా లేదు. రెండో దశ కరోనా తీవ్రంగా, ప్రమాదకరంగా విజృభిస్తోంది. అగ్రరాజ్యంలో అక్టోబరు మాసంతో పోలిస్తే నవంబరులో రోజురోజుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గత 10 రోజుల్లో గంటకు 1000 మంది చొప్పున వైరస్‌ బారిన పడుతున్నారు. శీతాకాలం సమీపిస్తున్న కొద్ది దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ కరోనా తీవ్రంగా వ్యాప్తిచెందుతుంది. రాబోయే నెలల్లో కరోనా కేసులతో ఆసుపత్రులు చేరేవారితో పాటు మరణించేవారి సంఖ్య కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version