పార్లమెంట్ లో బయటపడ్డ 400 ఏళ్ల నాటి రహస్య ద్వారం…!!!

-

ఒకప్పుడు బ్రిటిష్ చక్రవర్తులు ఉపయోగించిన 360 సంవత్సరాల నాటి పురాతన మార్గం తిరిగి పార్లమెంట్ భవనం లో కనుగొన్నారు. ఇది ఒక రహస్య మార్గం అని భావిస్తున్నారు. ప్రస్తుతం క్రితం భవనంలో రీస్టోరేషన్ పనులు జరుగుతుండగా ఇందుకోసం పార్లమెంట్ ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ టీం పరిశీలిస్తుండగా హౌస్ ఆఫ్ కామన్స్ అడుగున ఓ సీక్రెట్ డోర్‌ను గుర్తించారు. దీనిని 17వ శతాబ్ధం నాటిదిగా వారు భావిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ద్వారాన్ని శాశ్వతంగా కప్పబడి ఉంచినట్లు తెలుస్తుంది. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌ నగరం ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది. రాజకీయంగా, వైజ్ఞానిక, విద్య, వినోదం, కళలు, ఫ్యాషన్ రాజధానిగా ఉన్న లండన్ నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అయితే రిస్టోరేషన్ పనుల్లో భాగంగా పార్లమెంట్ భవనంలో పనులు నిర్వహిస్తుండగా ఈ రహస్య ద్వారాన్ని కనిపెట్టారు. 1661లో కింగ్ చార్లెస్-II పట్టాభిషేకం సందర్భంగా ఈ రహస్య ద్వారాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది.

అయితే పార్లమెంట్ బిల్డింగ్‌కు సంబంధించిన వివరాల కోసం స్వీడన్‌లోని హిస్టారిక్ ఇంగ్లాండ్ ఆర్కైవ్స్‌లో ఉన్న 10 వేల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నప్పుడు వెస్ట్ మినిస్టర్ హాల్ వెనుక ఈ పురాతన ద్వారం ఉన్న విషయాన్నీ గుర్తించామని హిస్టరీ ప్రొఫెసర్ లిజ్ హలాం స్మిత్ తెలిపారు. దశాబ్దాలుగా, 1660 లో నిర్మించిన మార్గం యొక్క ఏకైక అవశేషం వెస్ట్ మినిస్టర్ హాల్ లోపల ఇత్తడి ఫలకం, పార్లమెంటు భవనాలలో పురాతనమైనది, ప్రవేశం ఎక్కడ ఉందో సూచించినట్లు తెలుస్తుంది. చార్లెస్ II యొక్క 17 వ శతాబ్దపు పట్టాభిషేక విందు సమయంలో ఈ రహస్య ద్వారాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. వీటి వెనుకే హౌస్ ఆఫ్ కామన్స్‌కు కనెక్ట్ అయ్యే ఈ సీక్రెట్ డోర్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version