హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా సభలు, కార్యక్రమాలు, బహిరంగసభలు, ఐదుగురికి మించి గుమిగూడకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అమలు చేసిన సెక్షన్-163ని వెంటనే ఎత్తివేయాలని సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ నేత బక్కజడ్సన్ డిమాండ్ చేశారు. వెంటనే ఈ సెక్షన్-163ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఆర్సీలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
మానవ హక్కులను కాలరాస్తూ సీఎం నెల రోజుల పాటు ఆంక్షలు విధించడం ఏంటని నిలదీశారు. వెంటనే దాన్ని ఎత్తివేయాలని కోరారు. కాగా, రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అటు ప్రజల నుంచి, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉమ్మడిగా నిరసనలు సైతం చేపట్టకుండా రేవంత్ సర్కార్ అణచివేత ధోరణిని అవలంభిస్తోందని గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.మరోవైపు బెటాలియన్ కానిస్టేబుళ్లు సైతం సీరియస్ అవుతున్నారు.