సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే.. ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. ఈ నెల 16న గుండెనొప్పితో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరారు. హృద్రోగ సమస్యలతో పాటు.. మధుమేహం వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 1.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇది ఇలా ఉండగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని భావించారు. సాధారణంగా ఎమ్మెల్యే మరణించినా లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవి కాలం ఏడాది కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదని చట్టం చెబుతోంది. జి.సాయన్న ఎమ్మెల్యే, పదవి కాలం తొమ్మిది నెలలే మిగిలిఉంది. చట్టం ప్రకారం ఉపఎన్నిక నిర్వహించవచ్చు.