ప్రీతీ రేప్ అండ్ మర్డర్ వెనుక అధికార పార్టీ ఉంది.. వదలం !

-

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు నన్ను కోరారని సుప్రీంకోర్టు న్యాయవాది, నిర్భయ కేసుని వాదించి గెలిచిన సీమా కుష్వాహ అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అత్యాచారం జరిగిందని తేలిందని అయినా సరే ఈ కేసులో రాజకీయ ప్రముఖులు జోక్యం చేసుకుంటున్నందున 8 రోజుల్లోనే నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారని అన్నారు. ప్రీతి కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ఆమె అన్నారు.

నవంబర్ 2 తరువాత ప్రీతి సుగాలి కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు కేసులో పురోగతి లేదని, నిందితుల వెనుక రాజకీయంగా బలమైన వ్యక్తులు ఉండటంతోనే న్యాయం జరగటం లేదని ఆమె అన్నారు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టును కోరతామని ఆమె అన్నారు. నిందితుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version