RRR : ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో ఫ్యామిలీతో చూసిన‌ ఎన్టీఆర్

-

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మానియా నడుస్తుంది. ఈ రోజు ఈ సినిమా పాన్ ఇండియా రెంజ్ విడుద‌ల అయిన విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా బెనిఫిట్ షో కొన్ని థీయేట‌ర్స్ లలో నిన్న రాత్రే విడుద‌ల చేశారు. దీంతో ప‌లువురు అభిమానులు, సెల‌బ్రెటీలు వేల రూపాయలు ఖ‌ర్చు చేసి బెనిఫిట్ షో ను చూశారు. కాగ ఆర్ఆర్ఆర్ లో న‌టించిన ఎన్టీఆర్ కూడా నిన్న రాత్రి బెనిఫిట్ షో చూశారు. ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ లో ఎన్టీఆర్ తో పాటు క‌ళ్యాణ్ రామ్ కుటుంబాలు, అలాగే నంద‌మూరి ఫ్యామిలీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను చూసింది.

కాగ థీయేట‌ర్ కు వ‌చ్చిన స‌మ‌యంలో అభిమానుల‌కు ఎన్టీఆర్ విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తు.. థీయేట‌ర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగ నాలుగేళ్ల నిరీక్షణ త‌ర్వాత ఈ భారీ బ‌డ్జెట్ సినిమా విడుద‌ల కావ‌డంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే సినిమా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కూడా ప్ర‌మోషన్స్ విప‌రీతంగా చేయ‌డంతో మ‌రింత అంచ‌నాలు పెరిగాయి. కాగ ఈ సినిమాకు ప్ర‌స్తుతం పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

ఇక్క‌డ గానీ, ఓవ‌ర్సీస్ లో గానీ బెనిఫిట్ షో లు చేసిన అభిమానులు.. బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ న‌టన పీక్స్ లో ఉంటుంద‌ని అంటున్నారు. అలాగే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి టేకింగ్, స్క్రీన్ ప్లే బాగుంద‌ని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version