కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ పేరతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా దిల్ సుఖ్ నగర్లో ర్యాలీ చేయాలని భావించింది. అయితే పోలీసుల అనుమతి లేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలను, విద్యార్థులను, నాయకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే తొలిదెబ్బ నేనే తింటా అని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. దీంతో రేవంత్ రెడ్డిని పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలను ట్విట్ చేశారు. 1942 క్విట్ ఇండియా మూవెంట్ సమయంలో మహాత్మ గాంధీని బ్రిటిష్ వాళ్లు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం బ్రిటిష్ లాంటి కేసీఆర్ మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.