సీఎం రేవంత్ కన్నెర్ర..జగిత్యాలలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

-

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. ఎవరైనా అనుమతి లేకుండా రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు.ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట,అరెపెల్లి గ్రామాల్లోని శివారులోని గోదావరి నదిలో ఇసుక తవ్వకాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం. అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తాం.. ఇసుకను పేదలకు అందుబాటులో ఉంచాలి. వాగుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news