సీనియర్ నటుడు బ్రతకాలంటే అద్భుతం జరగాల్సిందే: వైద్యులు

-

అక్టోబర్ 6 న కోల్‌కతాలోని బెల్లె వి ఆస్పత్రిలో జాయిన్ అయిన సీనియర్ నటుడు సౌమిత్రా ఛటర్జీ బ్రతకాలి అం కచ్చితంగా అద్భుతం జరగాలి అని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు పేర్కొన్నారు. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు దీనిపై ప్రకటన చేసారు. రాత్రి 9 గంటలకు మెడికల్ బులెటిన్ ను డాక్టర్ అరిందం కర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చికిత్సకు స్పందించడం లేదు. ఈ పరిస్థితిలో అద్భుతాలు జరగాలి” అని ఆయన పేర్కొన్నారు.

సౌమిత్రా ఛటర్జీ కుటుంబానికి సమాచారం ఇచ్చామని ఆయన అన్నారు. 40 రోజుల నుంచి ఆయనను బ్రతికించడానికి పోరాటం చేస్తున్నామని అన్నారు. ఆయన వయసు 85 ఏళ్ళుగా ఉంది. కరోనా బారిన పడి గత నెల ఆరున ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వారం తర్వాత ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version