కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా..!

-

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిందనే చెప్పాలి. ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అమలాపురం పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కల్వకొలను తాతాజాగీ కాంగ్రెస్ పార్టీకి, ఏపీ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అంబేద్కర్ కోనసీమ జిల్లా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల రెడ్డికి పంపారు. ఇప్పటికే ఆయన జనసేనలో చేరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగా నల్లా శ్రీధర్ నిర్వహించిన రథయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు.

గతంలో స్వయంగా మంత్రి నాదేండ్ల తాతాజీ ఇంటికి వెళ్లి జనసేనలో చేరాలని కోరినప్పటికీ ఆయన తాను ముద్రగడ వెంటే ఉంటానని చెప్పి తిరస్కరించారు. అయితే ముద్రగడ వైసీపీ లో చేరినప్పటికీ తాతాజీ మౌనంగానే ఉండిపోయారు. తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేయడం.. ఇప్పటికే జనసేన నాయకులు లింగోలు పండు, ఏడిద శ్రీనులు అధిష్టానం వద్ద లైన్ క్లియర్ చేయడంతో జనసేన పార్టీలో చేరడం లాంఛనమేనని పలువురు చర్చించుకోవడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version