సంగారెడ్డి పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా తన కుమార్తెతోనే దశరథ్‌కు కాల్ చేసి తండ్రి గోపాల్ ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. నా కూతురి జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్‌తో బాలిక తండ్రి తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
అనంతరం ఆగ్రహంతో బండరాయితో మోదీ దశరథ్‌ని గోపాల్ హత్య చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టె ప్రయత్నం చేసినట్లు తెలిసింది.మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికి.. ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసి బాలిక తండ్రి గోపాల్ ఇంటికి వచ్చినట్లు తెలిసింది.కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
సంగారెడ్డి పరువు హత్యలో సంచలన విషయాలు..
తన కుమార్తెతోనే దశరథ్ కు కాల్ చేసి ట్రాప్ చేసిన గోపాల్
నా కూతురి జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్ తో తీవ్ర వాగ్వాదానికి దిగిన బాలిక తండ్రి
ఆగ్రహంతో బండరాయితో మోది దశరథ్ ని హత్య చేసిన గోపాల్
అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టె… pic.twitter.com/p7fn5BIzZz
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025