ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎంకు.. దేవదాయ శాఖ ఇస్తే బాగుంటుందని విమర్శించారు.ప్రశ్నించడానికి పుట్టానని చెబుతున్న పవన్..కాషాయ దుస్తులు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం అయ్యుండి పాలన చేయకుండా లడ్డూలో కల్తీ పేరుతో మౌన దీక్ష చేస్తా అనడం సబబు కాదన్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న పవన్ ప్రశ్నించకుండా మౌనదీక్షలు,కాషాయం అంటూ తిరగడం వింతగా ఉందన్నారు.గిరిజన ప్రాంతాల్లో అదానీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులకు 2022లో ఏకంగా 2,500 ఎకరాలను కేటాయించారని, దీనిపై ప్రశ్నించరని విమర్శించారు.