గతంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదల దగ్గర భూములను అన్యాయంగా లాక్కున్నారని, ఎవరైతే పేదలను బెదిరించి అన్యాయంగా లాక్కున్నారో వారి పాపం పండిందని తెలుగుదేశం పార్టీ బుధవారం సంచలన పోస్టు చేసింది. గత ఆరు నెలల్లో 67 వేలకు పైగా భూసమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు పెట్టి, ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తోందని పేర్కొంది.
ఎవరైతే ప్రజల నుంచి భూములు లాక్కున్నారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు వారి భూమిని తిరిగి అప్పగించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని గుర్తు చేసింది. సామాన్యులకు న్యాయం చేయడం, అక్రమార్కులను శిక్షించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ నాయకులు స్పష్టంచేశారు.
గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో, పేదల దగ్గర భూములు లాక్కున్న సైకోలు పాపం పండుతుంది. గత ఆరు నెలల్లో 67 వేలకు పైగా భూసమస్యల పై ఫిర్యాదులు రావటంతో, ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు పెట్టి, ప్రజల భూ సమస్యలు పరిష్కారం చేస్తుంది.#RevenueSadassulu#IdhiManchiPrabhutvam#AndhraPradesh pic.twitter.com/sIjzkqXMGe
— Telugu Desam Party (@JaiTDP) December 11, 2024