పార్లమెంట్ లో భారత రాష్ట్రపతి సంచలన ప్రకటన !

-

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. అంబేద్కర్ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుందని.. ప్రభుత్వ కృషితో యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతోందన్నారు. “జనఔషధి” కేంద్రాల ద్వారా తక్కువ ధరకు అందుబాటులో మందులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం తక్కువ ధరకు మందులు అందించడం ద్వారా చికిత్స ఖర్చును తగ్గించిందని వెల్లడించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో మహిళల పాత్ర మరింత విస్తృతం చేసిందని పేర్కొన్నారు. 2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించారు. ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువ అని తెలిపారు. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో 150 కోట్ల వ్యాక్సినేషన్లు అధిగమించామని.. భారత వ్యాక్సిన్లు కోట్లమంది ప్రాణాలను కాపాడాయని వెల్లడించారు. దేశంలో అర్హులైన 90 శాతం కంటే ఎక్కువమంది మొదటి డోసు టీకా తీసుకున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ సునిశిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్యసేవలు అందించామని.. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కోట్ల మందికి “ఆయుష్మాన్‌ భారత్‌” కార్డులు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version