ఓబీసీ సర్టిఫికేట్ ఉపయోగం ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే ఈ సర్టిఫికెట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్ల పై పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. OBC సర్టిఫికెట్లను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 1993లో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఇప్పటికే ఉద్యోగాలు, పథకాల లబ్ది పొందిన వారి పై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.