ఓటేస్తామని ఒట్టు వేయండి.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సెంటిమెంట్ రాజకీయాలు..!

-

హుజూరాబాద్​ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల రాజేందర్​ రాజీనామా చేసిన నాటి నుంచి హుజూరాబాద్​ అసెంబ్లీలో రాజకీయాలు హీటెక్కాయి. ఒక్కరేమిటి గులాబీ శ్రేణులు పెద్ద మొత్తంలో హుజూరాబాద్​ అసెంబ్లీ స్థానంపై కన్నేశారు. ఎలాగైనా సరే ఇక్కడ ఈటలను ఓడించి గులాబీ జెండాను రెపరెపలాండిచాలాని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందు కోసం అనేక హామీలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొత్త పథకాలు రూపొందించుకుంటూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక మరో పక్క టీఆర్​ఎస్​ కు రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్​ ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర మొదలు పెట్టినా తన ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి పాదయాత్రను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.

Huzurabad | హుజురాబాద్

ఇక అనేక హామీలు గుప్పించడం ఒక ఎత్తయితే ప్రస్తుతం హుజూరాబాద్​ నియోజకవర్గంలో ప్రమాణాల ట్రెండ్​ కూడా కొనసాగుతుంది. దీనిపై ఇతర పార్టీల నేతలు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. అయినా కానీ టీఆర్​ఎస్​ నేతలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. తాజాగా కమలాపూర్​ మండంలోని గూడూరు గ్రామంలో గ్రామస్తులంతా టీఆర్​ఎస్​ కే ఓటు వేసేలా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ప్రమాణం చేయించడం హాట్​ టాపిక్​ గా మారింది.

ఇన్నాళ్లు నాయకులను చేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చిన గులాబీ నేతలు ప్రస్తుతం ప్రమాణాలు చేయిస్తూ ఓటర్లు జారి పోకుండా ఉండేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వేచి చూడాలి హుజూరాబాద్​ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో. ఇంకా నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్​ కూడా వెలువడకపోవడం గమనార్హం. ఇప్పుడే హంగామా ఇలా ఉంటే ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఇంకెలా ఉంటుందో అని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version