IPL 2022 : KKR ప్లేయర్ కు రెజ్లర్ స్పెషల్ ట్రీట్ !

-

ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇవాలల కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే నైట్రైడర్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా వెంకటేష్ అయ్యర్ ఆకట్టుకుంటున్నాడు. ఇవాళ చెన్నై జట్టుతో జరగనున్న తొలి మ్యాచ్ నేపథ్యంలో నెట్స్ లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు వెంకటేష్. అయితే తొలి మ్యాచ్ కు సిద్ధమవుతున్న వెంకటేష్ కు తాను అభిమానించే ఓ స్టార్ నుంచి ప్రత్యేక సందేశం వచ్చింది.

దీంతో అయ్యర్ మురిసిపోయాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ సెథ్ రోలిన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు వెంకటేష్ అయ్యర్. ఈ విషయం తెలుసుకున్న రోలిన్స్ కు మ్యాచ్ కు ముందు వెంకటేష్ అయ్యర్ కు మెసేజ్ పంపాడు.

తన అభిమాని గా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని… ఐపీఎల్ మెగా టోర్నీలో బాగా ఆడి ఛాంపియన్ గా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వీడియో సందేశం పంపించేశాడు సేథ్ రోలిన్స్. ఇది చూసిన అయ్యర్ సర్ప్రైజ్ అయ్యాడు. కాగా అయ్యర్ గత సీజన్లో కేకేఆర్ తరపున విశేషంగా రాణించాడు. 10 మ్యాచుల్లో 41 సగటుతో 375 పరుగులు చేశాడు. కేక ఫైనల్ కు చేరడం లో అతని పాత్ర ఎంతో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version