భార్య లైంగిక వేధింపులు.. భర్త ఆత్మహత్యాయత్నం

-

భార్య లైంగిక వేధింపులు భరించలేక ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఏపీలోని కాకినాడకు చెందిన సూర్యనారాయణపురంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. భార్య వేధింపులు తాళలేక బాధిత వ్యక్తి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం.. వెంకటరమణ, త్రివేణి భార్యభార్తలు. పెళ్లైన కొత్తలో వీరి కాపురం బాగానే సాగింది.

 

ఆ తర్వాత భార్య పెట్టే వేధింపులు తీవ్రం అయ్యాయని.. అత్త మమా, బావ మరిది వేధింపులకు గురిచేయడమే కాకుండా తనపైనే వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.పెళ్లైన కొత్తలో తన భార్య వాళ్ల బావతో చాటింగులు చేసిందని, ఆషాడమాసం నెలలో అమ్మగారింటికి వెళ్లి ఇరుగుపొరుగున ఉండే మగవాళ్లతో కూడా చాటింగులు చేసిందని గుర్తించానని.. ఇక రాత్రిళ్లు లైంగికంగా చాలా హింసించేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని బాధిత భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version