ప్రస్తుతం సమాజంలో మహిళలు, పురుషులు సమానంగా పని చేస్తున్నారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల దగ్గర నుంచి.. డాక్టర్లు, పోలీసులు, ఆర్మీల్లో, అంతరిక్ష, వ్యవసాయ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. సమాజం నుంచి తోటి ఉద్యోగుల నుంచి మరింత ప్రోత్సాహం దొరికితే.. మరింత ఉన్నత స్థానాలకు ఎదిగే శక్తి మహిళల సొంతం.
‘సేఫ్ ప్లేసెస్ టు వర్క్’ సర్వే 2019 ప్రకారం, 27% మంది మహిళలు ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న మహిళలు తమ ఉద్యోగ జీవిత చక్రంలో కనీసం 3 రోజులకు ఒకసారి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారు. లైంగిక వేధింపులపై స్పందించేందుకు కూడా మహిళలు విముఖత చూపిస్తున్నారు. అయినా 62 శాతం మంది స్పందించినా… తమను వేధించే వారి ప్రొఫైల్ బయటపెట్టకూడదని అంటున్నారు.
ఫిర్యాదు చేస్తే వచ్చే ఇబ్బందులతో భయపడుతున్న మహిళలు
మహిళలు ఫిర్యాదు చేయడం కన్నా.. ఫిర్యాదు చేస్తే వచ్చే ఇబ్బందులతోనే ఎక్కువగా భయపడుతున్నారు. ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, దాదాపు 80% మంది మహిళలు లైంగిక వేధింపులపై ఏలా ఫిర్యాదు చేాయాలనే విషయం తెలిసినప్పటికీ… 30 % మహిళలు ఇప్పటీకీ ఇటువంటి లైంగిక వేధింపుల ఘటనలపై అంతర్గత కమిటీకీ ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న సగానికి కన్నా ఎక్కువ శాతం మహిళలు లైంగిక వేధింపులు జరిగిన అదే ప్రదేశంలో పనిచేస్తారా.. లేదా.. అనే విషయంపై ఖచ్చితంగా చెప్పలేదు.
అసలు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే… ఒక్కసారిగా సదురు మహిళ లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిగా మారుతోంది. దీంతో పాటు సహోద్యోగుల నుంచి సరైన మద్దతు లభించనప్పుడు ఈ బాధ మరింత పెరుగుతోంది. ఇటువంటి సమయాల్లో మహిళ ఉద్యోగులు నిరాశకు, ఆందోళనకు గురవుతున్నారు.
ప్రతీకారం తీర్చుకున్న సంఘటనలు ఉంటున్నాయి.
లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన తర్వాత.. ఒక్కోసారి సదురు మహిళపై ప్రతీకారం తీర్చుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు, వారికి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌ల నుంచి తీసేస్తున్నారు. కావాలని ఇబ్బందుల పాటు చేస్తున్నారు. అవసరం లేకున్నా ఎక్కువ పని గంటలు ఉండాలని కోరడం.. కాస్త ఆలస్యం అయినా అందరి ముందు కించపరిచేలా మాట్లాడటం వంటివి చేస్తున్నారు. తీవ్రమైన సందర్భాల్లో, వారు సంస్థను విడిచిపెట్టవలసి వస్తుంది.