త్వరలో ఆటం బాంబు పేలుస్తాం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

-

నాటు బాంబు.. లక్ష్మీ బాంబు కాదు.. త్వరలో ఆటం బాంబు పేల్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శ్రీనివాస్ రెడ్డి ఎవరు..? హోంమంత్రినా..? ఫస్ట్ నువ్వు జైలుకు వెళ్తావు చూసుకో అని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుద్దేశించి మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వారిని చట్టం అస్సలు వదిలిపెట్టదని హెచ్చరించారు. తప్పు చేయకపోతే కేటీఆర్ కి ఉలికిపాటు ఎందుకు అని ప్రశ్నించారు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయన్నారు.

అసలు తప్పు చేయనందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు. కేటీఆర్ పేరో, ఆయన బావ పేరో, వాళ్ల నాన్న పేరో తీసుకురాలేదన్నారు. పేద వాడికి సంబంధించిన సొత్తు ఎలా కొల్లగొట్టారో తెలుసు కాబట్టే పాదయాత్ర చేస్తామని నాటకాలు ఆడుతున్నారని వెల్లడించారు. పదవీలో ఉన్నప్పుడు మనిషిని మనిషిలా గౌరవించని మీకు పదవీ పోయిన వెంటనే పేదవాడి కష్టం గుర్తుకొచ్చిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version