అమెరికాతో మాట్లాడే దమ్మూ కేంద్రానికి లేదు : షబ్బీర్ అలీ

-

ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక.. మన దేశానికి లాభం అని అనుకున్నారు. కానీ 104 మందిని నిన్న దేశానికి పంపించారు. జనవరి నుండి.. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని పంపిస్తాం అంటూనే ఉన్నారు. కానీ కేంద్రం అసలు.. దీనిపై మాట్లాడలేదు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అమెరికా నుండి చేతులు..కాళ్ళు కట్టేసి తెచ్చారు. వాళ్ళను కనీసం ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోలేదు. మోడీ అంటే విశ్వగురు అని చెప్పుకునే బీజేపీ నేతలు.. 104 మందిని అమెరికా వెనక్కి పంపితే మోదీ ఎందుకు మాట్లాడటం లేదు.

2008లో గల్ఫ్ నుండి 44 వేల మందిని మేము తీసుకువచ్చాం. దుబాయ్ లో ఇండియా ప్రభుత్వం 10 వేల ఖర్చుతోనే తీసుకు వచ్చాం.. డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించింది. మోడీ విశ్వగురు కనీసం ఎందుకు పట్టించుకోవడం లేదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫెయిల్ అయ్యారు. అమెరికా తో మాట్లాడే దమ్మూ కేంద్రానికి లేదు.. అమెరికా అంటే ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు షబ్బీర్ అలీ.

Read more RELATED
Recommended to you

Latest news