కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై ప్రభుత్వానికి కమిట్ మెంట్ ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కు కట్టుబడి ఉన్నాం అని ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ అన్నారు. కుల గణన సర్వే లో లోపాలు ఉంటే సూచనలు చేయాలి, కానీ సర్వేలో పాల్గొనని వారు సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చట్టం చదవాలి, అవగాహన తో మాట్లాడితే బాగుంటుంది అని పేర్కొన్నారు.
అలాగే ముస్లిం లలో కొన్ని తెగలు దశాబ్దాలుగా బిసీలుగా ఉన్నారు. కేంద్రం బ్యాక్ వార్డు లిస్టులో కూడా బీసీ లో ఉన్నారు. కులగణన విషయంలో అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం మానుకోవాలి. రాష్ట్రంలో 26 లక్షల మంది కోసం కులగణనలో పాల్గొనలేదు , వాళ్లుకు మరో అవకాశం కల్పించాం. ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దు, బీసీ కులాలకు, వృత్తులకు న్యాయం జరగాలంటే సర్వేలో పాల్గొనాలి అని షబ్బీర్ అలీ స్పష్టం చేసారు.