బీజేపీకి కేసీఆర్ షాక్..తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణకు టీఆర్‌ఎస్‌ సర్కారు సిద్ధం

-

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు ప్రగతిభవన్‌లో మంత్రి వర్గం సమావేశం కానుంది. అయితే.. తెలంగాణ విలీన దినోత్సవాలను అధికారికంగా మూడు రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రాగా ఆ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతో కూడిన హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత్ లో విలీనమైంది. తెరాస ఆవిర్భావం తర్వాత 2001 నుంచి ఏటా తెలంగాణ భవన్ లో విలీన దినోత్సవాలను పార్టీ నిర్వహిస్తోంది.

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెరాస తరపునే ఉత్సవాలు జరుగుతున్నాయి. అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్లు వచ్చిన ప్రభుత్వం అంగీకరించలేదు. ఈనెల 17 నాటికి హైదరాబాద్ రాష్ట్రం విలీనమై 74 ఏళ్లు పూర్తయి, 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విలీన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version