మరో ఫీచర్ ని తీసుకొచ్చిన పేటిఎం…!

-

ప్రస్తుత కాలంలో డిజిటల్ మార్కెటింగ్ బాగా పెరిగింది. దీంతో నగదు లావాదేవీలు అన్ని కూడా పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా పూర్తిగా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఏది కొన్నా లేదా అమ్మిన కూడా నగదు తో పని లేకుండానే పనులు జరిగిపోతున్నాయి. ఈ తరహాలో వచ్చినదే పేటిఎం కూడా మన ఫోన్ లో యాప్ ఉంటే చాలు ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా దీని ద్వారా చేయవచ్చు.

కొన్నాళ్ళ క్రితం పేమెంట్ బ్యాంకు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంస్థ మరో అడుగు ముందుకేసి ఇన్సూరెన్స్ రంగం లో కి వచ్చింది. వినియోగదారులు ఇకపై అన్ని ప్రధాన కంపెనీల ఇన్స్యూరెన్స్ పాలసీలన్నీ పేటీఎంలో కొనొచ్చు. అంటే ఇకపై పేటీఎం ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా అమ్మనుంది. దీనికోసం పేటిఎం ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI నుంచి లైసెన్స్ పొందింది.

లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలతో పాటు నాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా పేటిఎం అమ్మనుంది. పేటీఎంకు 1.6 కోట్ల మర్చంట్ పార్ట్‌నర్ బేస్ ఉంది. ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మాలనే ఆలోచనలో పేటిఎం ఉంది. పేటిఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 100 శాతం సబ్సిడరీగా ‘పేటీఎం ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పనిచేస్తుంది.

ఈ సంస్థ ద్వారా భారతదేశంలో లక్షలాది మందికి ఇన్స్యూరెన్స్ పాలసీలను అమ్మేందుకు సిద్ధమైంది. పేటిఎం మూడేళ్ల క్రితం కార్పొరేట్ ఏజెన్సీగా ఇన్స్యూరెన్స్ బిజినెస్ ప్రారంభించింది. పేటిఎం లావాదేవీలపై యాడ్ ఆన్‌గా ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్‌ని అమ్మేది. కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్‌ని వదిలి బ్రోకరేజ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది పేటిఎం . ఇకపై ఏవైనా ఇన్స్యూరెన్స్ పాలసీలు కావాలంటే పేటీఎం ద్వారా తీసుకోవడం సులువు.

భారతదేశంలోని 20 ప్రముఖ ఇన్స్యూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది పేటీఎం. కొన్ని వారాల్లో మరో 30 కంపెనీలతో ఒప్పందం చేసుకోబోతోంది. పేటీఎం ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మొత్తం నాలుగు కేటగిరీల్లో ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్‌ని ఆఫర్ చేస్తుంది. అందులో లైఫ్, హెల్త్, టూవీలర్, ఫోర్ వీలర్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉంటాయి. పేటీఎం నుంచి ఇన్స్యూరెన్స్ సేవలు కొత్తేమీ కాదు. అయితే అన్ని ప్రధాన కంపెనీల యొక్క ఇన్సూరెన్స్ పాలసీ లను సామాన్యుడికి మరింత అందుబాటులోకి పేటిఎం తెచ్చిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version