అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉద్యోగ నోటిఫికేషన్ల పైనే చేస్తా : షర్మిల

-

వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం లోకి వచ్చిన వెంటనే తన తొలి సంతకం ఉద్యోగ నోటిికేషన్ల పైనే చేస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కుటుంబం లో అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ లు ఇస్తామని చెప్పారు. అదే విధంగా బాధితులకు అందరికీ కరోనా బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని….ఇల్లు నిర్మిస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

Sharmila

సంక్షేమం…స్వయం సమృద్ది…సమానత్వం తమ లక్ష్యం అని షర్మిల అన్నారు. ఇదిలా ఉండగా వైయస్ షర్మిల పార్టీ స్థాపించిన నాటి నుండి నిరుద్యోగుల కోసం సభలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను షర్మిల పరామర్శిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర నేటితో 20వ రోజుకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version