తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ తనయురాలిగా పార్టీ పెట్టిన షర్మిల అవకాశం వస్తే చాలు సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణ రాజకీయాలలో కీలకంగా మారుతుంది అనుకున్న వైఎస్ షర్మిల ఎటు వెళ్తుందో అర్థంకావడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈమె కేసీఆర్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల TSPSC పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ లీక్ జరగడానికి ముఖ్యకారణం ఐటీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అని మండిపడింది షర్మిల. ఇందుకు కేటీఆర్ పూర్తి బాధ్యత వహించాలని షర్మిల రెచ్చిపోయారు. ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బంది పడడానికి కారణమైన ఈ పేపర్ లీక్ గురించి ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని సూటిగా అడిగింది.
సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల
-