మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షర్మిల లేఖ రాశారు. ఏమాత్రం భవిష్యత్తు లేని బీఆర్ఎస్ అజెండాను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ఆమె విమర్శించారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని… దీనిపై మీరు ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.
ఎనిమిదేళ్ల పాలన పూర్తవుతున్నా సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు. గిరిజనులకు ఇంత వరకు పోడు భూములకుపట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మీ హామీ ఏమయిందని నిలదీశాలరు. తెలంగాణనే అభివృద్ధి చేయలేని మీకు.. జాతీయ రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు. 8 ఏళ్లుగా పోడు పట్టాలెందుకు ఇవ్వట్లేదో కేసీఆర్ చెప్పాలి? అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.
Today I wrote a letter to CM KCR questioning the terrible treatment his regime has meted out to the people of the unified Khammam district.
Before he steps on the Khammam soil tomorrow,he owes an explanation over 10 unfulfilled promises made to the people there.
@TelanganaCMO pic.twitter.com/sVuYIzfpvr— YS Sharmila (@realyssharmila) January 17, 2023